రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
ABN, Publish Date - Mar 04 , 2025 | 10:03 AM
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి

టీచర్స్ స్థానంలో బరిలో 15 మంది, పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీ చేశారు

నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు

మొత్తం 3 లక్షల 55 వేల 159 ఓట్లు ఉండగా.. 2 లక్షల 50వేల 106 ఓట్లు పోలయ్యాయి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు 24139 పోలయ్యాయి

93.57 ఓటింగ్ శాతం నమోదైంది. 25 టేబుళ్లపై 25 రౌండ్లలో కౌంటింగ్ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 350 మంది కౌంటింగ్ సిబ్బంది, 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Updated at - Mar 04 , 2025 | 10:07 AM