Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి

ABN, Publish Date - Sep 28 , 2025 | 04:26 PM

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 2.0ను నిర్వహించారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఈ రన్‌ను ప్రారంభించారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 1/9

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్ 2.0ను నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పింక్ పవర్ రన్‌ 2.0లో రిజిస్టర్ చేసుకున్న 25 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 2/9

ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ రన్‌లో ఎమ్‌ఈఐఎల్ ఎండీ మేఘా కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాతా, టెన్నిస్ ప్రముఖ క్రీడాకారుడు లియండర్ పేస్, సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్, చైర్ పర్సన్ మేఘా సుధారెడ్డితోపాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 3/9

మేఘా ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్‌తోపాటు సుధారెడ్డి ఫౌండేషన్ ఈ 3 కే రన్ నిర్వహించాయి.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 4/9

ఈ రన్‌లో యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రసంగించారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 5/9

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అనేక మందికి నేటికి అవగాహన లేదని వారు వాపోయారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 6/9

ఈ అంశంపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వారు సూచించారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 7/9

అలాగే విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిర్వాహాకులు వెల్లడించారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 8/9

దీనిపై ప్రజల్లో చాలా తక్కువగా అవగాహన ఉందని.. అందుకోసమే ఈ 3 కే రన్ నిర్వహించినట్లు నిర్వాహాకులు స్పష్టం చేశారు.

Pink Power Run 2.0 In Hyderabad:హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్.. పాల్గొన్న ప్రపంచ సుందరి 9/9

ఈ 3 కే రన్ విజయవంతం కావడం పట్ల నిర్వాహాకులు హర్షం వ్యక్తం చేశారు.

Updated at - Sep 28 , 2025 | 04:29 PM