హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆధ్వర్యంలో జంట నగరాల్లోని మద్యం దుకాణాల లక్కీ డ్రా..
ABN, Publish Date - Oct 27 , 2025 | 03:10 PM
జంట నగరాల్లోని మద్యం దుకాణాల లక్కీ డ్రాను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ లక్కీ డ్రాను జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి భారీగా దరఖాస్తు దారులు వచ్చారు. ఈ లక్కీ డ్రాలో మద్యం దుకాణం పొందిన వారికి సహచరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో ఈ లక్కీ డ్రాకు విచ్చేశారు.
1/8

2/8
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం తెలంగాణ ఆబ్కారీ శాఖ ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
3/8
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి కోసం 95,137 దరఖాస్తులు వచ్చాయి.
4/8
సోమవారం అంటే అక్టోబర్ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ఈ మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహించారు
5/8
గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. గతేడాది దాదాపు లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ ఏడాది 96 వేల లోపు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
6/8
ఈ దరఖాస్తులు సంఖ్య భారీగా తగ్గడంతో.. మద్యం దుకాణాల దరఖాస్తు గడువును మరి కొద్ది రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది.
7/8
అయినా దరఖాస్తులు మాత్రం తగ్గాయి. ఈ దరఖాస్తులు తగ్గడానికి గల కారణాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.
8/8
రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక దరఖాస్తులు హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, శంషాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చాయి.
Updated at - Oct 27 , 2025 | 03:12 PM