U Turns Too Danger In Hyderabad City: హైదరాబాద్‌లో ఈ యూటర్న్‌లు యమ డేంజర్..
ABN, Publish Date - Sep 25 , 2025 | 02:26 PM
హైదరాబాద్‌లో యూటర్న్‌లు యమ డేంజర్‌గా మారాయి. ఇక నగరంలో నిత్యం ఏదో ఒక యూటర్న్ వద్ద ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. కొందరు గాయాలతో బయటపడుతుండగా.. మరికొందరు మరణిస్తున్నారు. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నాయి.
1/6
నాలుగు చినుకులు పడితే చాలు హైదరాబాద్ మహానగరంలో రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇక ఉదయం సాయంత్రం సైతం రహదారులపైకి నగరంలోని వివిధ రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచి పోతుంది. దాంతో వాహనదారులు.. ఒక రకంగా నిత్య నరకాన్ని అనుభవిస్తున్నారు.
2/6
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని వాహనదారులు ఎటు వెళ్ల లేక పోతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో యూటర్న్‌లు యమ డేంజర్‌గా మారాయి. ఇక నగరంలో నిత్యం ఏదో ఒక యూటర్న్ వద్ద ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. కొందరు గాయాలతో బయటపడుతుండగా.. మరికొందరు మరణిస్తున్నారు. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు అనాధలుగా మిగులుతున్నాయి.
3/6
ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే మార్గంలో రెండు యూటర్న్‌లు ప్రమాదకరంగా మారాయి. అందులో ఒకటి ఆర్టీఏ కార్యాలయం యూటర్న్.
4/6
ఇక విద్యానగర్ - అంబర్‌పేట దారిలో. అలాగే తార్నాక - హబ్సిగూడ మధ్య, సికింద్రాబాద్ సెయింట్ జాన్స్ రోడ్డులోని మదర్ థెరిసా విగ్రహం వద్ద. బోయినపల్లి నుంచి కొంపల్లి వరకు నాగాపూర్ జాతీయ రహదారిపై..
5/6
ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు.., ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మార్గంలోని ఆటోనగర్, అరుణోయ కాలనీ, తొర్రూరు ఎక్స్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపులు ప్రమాదకరంగా మారాయి.
6/6
హైదరాబాద్ నగరంలో ఇలాంటి మలుపులు మరిన్ని ఉన్నాయి. వీటి వద్ద తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలోని రోడ్డు ప్రమాదాల్లో 22.6 శాతం యూటర్న్‌ల వద్ద చోటు చేసుకున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Updated at - Sep 25 , 2025 | 02:30 PM