భారీ వర్షంతో కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ..
ABN, Publish Date - Jul 18 , 2025 | 09:03 PM
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మణికొండ, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది.
1/9
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇలాంటి వేళ నగరవాసులకు హైడ్రా హెచ్చరికలు జారీచేసింది.
2/9
షేక్ పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీ వర్షం కారణంగా జనం అవస్థలు పడుతున్నారు.
3/9
ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో ఫుల్ ట్రాఫిక్ కనిపిస్తోంది. రాయదుర్గం, షేక్ పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
4/9
కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ లో భారీ వర్షం పడింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.
5/9
భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
6/9
కిలోమీటరు ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతోంది. టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లుతోంది.
7/9
వరద ప్రవాహానికి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్రేటర్ లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
8/9
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.
9/9
అటు, సంగారెడ్డి జిల్లాలోనూ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, పఠాన్ చెరు, ఆర్సీ పురం, జిన్నారం, సదాశివపేట మండలంలో భారీగా వర్షం కురుస్తోంది.
Updated at - Jul 18 , 2025 | 09:03 PM