GHMC: నిమజ్జనం పూర్తి.. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది
ABN, Publish Date - Sep 07 , 2025 | 06:43 PM
గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. వినాయకుడి నిమజ్జనం దాదాపుగా పూర్తయింది. మరికొన్ని ఆదివారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 7వ తేదీ) వరకు జరిగాయి. ఈ నిమజ్జనం సందర్భంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న హుస్సేన్ సాగర్‌కు భారీగా వినాయకుడి విగ్రహాలు తరలి వెళ్లాయి.
1/6
గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. వినాయకుడి నిమజ్జనం దాదాపుగా పూర్తయింది. మరికొన్ని ఆదివారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 7వ తేదీ) వరకు జరిగాయి.
2/6
ఈ నిమజ్జనం సందర్భంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్‌కు భారీగా వినాయకుడి విగ్రహాలు తరలి వెళ్లాయి.
3/6
ఈ నిమజ్జనాన్ని వీక్షించేందుకు ట్యాంక్ బండ్ వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. దీంతో పరిసర ప్రాంతమంతా చెత్త చెదారంతో నిండిపోయింది.
4/6
దాంతో ఆదివారం ఉదయం ఆ పరిసర ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిబ్బంది శుభ్రం చేశారు.
5/6
అయితే ఈ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చి.. తిరుగు ప్రయాణంలో రవాణా సౌకర్యాలు లేక పోవడంతో.. పలువురు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని పార్కుల్లో నిద్రకు ఉపక్రమించారు.
6/6
ఇంకోవైపు హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వ్యర్థాలు భారీగా చేరాయి. వాటిని సైతం వెలికి తీసే పనిలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.
Updated at - Sep 07 , 2025 | 07:27 PM