Cigachi Explosion: చివరి చూపైనా దక్కుతుందనే ఆశతో.. సిగాచీ ముందు పడిగాపులు..!
ABN, Publish Date - Jul 05 , 2025 | 07:25 PM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో గల్లంతైన వారి కోసం వెతుకులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. శిథిలాల ఏరివేత దాాదాపు పూర్తికావొచ్చినా 9 మంది జాడ ఇంకా తెలియడంలేదు. అయినా, బాధిత కుటుంబీకుల చివరి చూపైనా దక్కుతుందనే ఆశతో ఫ్యాక్టరీ ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నారు.
1/6
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా కర్మాగారం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.
2/6
జూన్ 30న జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఇప్పటికీ 9 మంది కార్మికుల ఆచూకీ తెలియడంలేదు.
3/6
శిథిలాల కుప్పల్లో కలిసిపోయిన కార్మికుల ఎముకలు, మాంసపు ముద్దల ఆధారంగా ఫోరెన్సిక్ నిపుణులు మృతులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
4/6
ప్రమాదం గడిచి ఆరు రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ 9 మంది ఆచూకీ తెలియడంలేదు. గల్లంతైన కార్మికుల మృతదేహాలను కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.
5/6
తమవారీ ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి బాధ వర్ణనాతీతంగా మారింది.
6/6
చివరిచూపైనా దక్కుతుందనే ఆశతో బాధితుల కుటుంబీకులు పగలనక రాత్రనక సిగాచీ పరిశ్రమ ముందే వేచి చూడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
Updated at - Jul 05 , 2025 | 07:54 PM