CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ..

ABN, Publish Date - Nov 19 , 2025 | 05:33 PM

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరితోపాటు పార్టీ సీనియర్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అందుకు నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు.

CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ.. 1/6

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరితోపాటు పార్టీ సీనియర్ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ.. 2/6

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అందుకు నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు.

CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ.. 3/6

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి.. వారి వివరాలు సేకరించాలని సూచించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు.

CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ.. 4/6

గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని వివరించారు.

CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ.. 5/6

నవంబర్ 19వ తేదీ నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం (డిసెంబర్ 9వ తేదీ) వరకు రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.

CM Revanth Pays Tribute to Indira Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళీ.. 6/6

రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8వ తేదీ ( అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వరకు పట్టణ ప్రాంతాల్లో ఈ చీరలు అందజేయనున్నారు.

Updated at - Nov 19 , 2025 | 05:34 PM