గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

ABN, Publish Date - May 13 , 2025 | 06:49 AM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో సోమవారం నాడు భేటీ అయ్యారు. భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులు, శాంతిభద్రతల గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 1/7

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌లో సోమవారం నాడు భేటీ అయ్యారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 2/7

ఈసమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పలు కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 3/7

గవర్నర్‌‌కు పూల బొకే అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 4/7

సుమారు 20 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 5/7

జాతీయ స్థాయి అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 6/7

కాగా ప్రపంచ సుందరీమణులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రభుత్వం తరపున ఇచ్చే విందులో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మను పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో  సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 7/7

అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని కూడా గవర్నర్‌ను సీఎం రేవంత్‌‌రెడ్డి ఆహ్వానం పలికారు.

Updated at - May 13 , 2025 | 07:22 AM