New Ration Cards: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్

ABN, Publish Date - Feb 09 , 2025 | 07:53 AM

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులు మీసేవ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల వద్ద బారులు దీరారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 1/7

కొత్త రేషన్‌ కార్డులతో పాటు ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 2/7

సికింద్రాబాద్ మీ సేవ కేంద్రం వద్ద రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలు సర్వర్ పనిచేయక పోవడంతో వెనుదిరిగారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 3/7

ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోడానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 4/7

రేషన్‌ కార్డుల దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే సర్వర్ పని చేయకపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 5/7

ఒకేసారి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్‌పై భారం పడి ఉండొచ్చని, శనివారం నుంచి వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తుందని ప్రజలు భావించారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 6/7

రేషన్‌ కార్డుల దరఖాస్తుల గురించి పౌరసరఫరాల శాఖ, మీసేవ తమను సంప్రదించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు దరఖాస్తుల కోసం శనివారం రోజంతా ప్రజలు మీ సేవ కేంద్రాల వద్ద నిరీక్షించారు.

New Ration Cards:  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్ 7/7

అయితే శనివారం దరఖాస్తుల ప్రక్రియ పునరుద్ధరణ కాలేదు. శాసనసమండలి ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లో ఉన్నందున ఈ ప్రక్రియను నిలిపివేశారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించింది.

Updated at - Feb 09 , 2025 | 08:57 AM