PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన

ABN, Publish Date - Mar 03 , 2025 | 08:17 AM

ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 1/7

రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన కల్పించారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 2/7

ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని చెప్పారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 3/7

యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 4/7

కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ గురవారెడ్డి సారథ్యంలోని సర్వేజన ఫౌండేషన్‌ రూపొందించిన ‘స్టాప్‌ యాక్సిడెంట్స్‌ యాప్‌’ను ఆదివారం విప్రో సర్కిల్‌ సమీపంలోని ఫీనిక్స్‌ కార్యాలయంలో పీవీ సింధు ప్రారంభించారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 5/7

ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విప్రో సర్కిల్‌ను ప్రమాదరహిత జంక్షన్‌గా మార్చేందుకు సోలార్‌ క్యాట్‌ ఐస్‌, జీబ్రా క్రాసింగ్‌ లైన్లు, సిగ్నేచర్‌ బోర్డులు, డిలైనేటర్స్‌ ఏర్పాటు చేశారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 6/7

డాక్టర్‌ గురవారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘స్టాప్‌ యాక్సిడెంట్స్‌ యాప్‌’ను తెచ్చామని అన్నారు.

PV Sindhu: రోడ్డు భద్రతపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధూ అవగాహన 7/7

ఈ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, అందులోని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ప్రతి నెలా రూ.లక్ష బహుమతులు అందజేస్తామని చెప్పారు.

Updated at - Mar 03 , 2025 | 08:17 AM