Actor Srikanth: మాదాపూర్‌లో సినీ నటుడు శ్రీకాంత్ సందడి
ABN, Publish Date - Feb 09 , 2025 | 07:12 AM
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకనుగుణంగా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. కార్ల విషయానికి వస్తే ఇప్పటికే మహీంద్రా పలు మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని కార్లను లాంచింగ్‌కు ఆ కంపెనీ సిద్ధం చేస్తుంది.
1/6
మాదాపూర్‌లో సినీ నటుడు శ్రీకాంత్ సందడి చేశారు. ఆయనను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఫ్యాన్స్‌ను శ్రీకాంత్ అప్యాయంగా పలకరించారు.
2/6
మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్లో శనివారం మహీంద్రా ఎలక్ట్రానిక్ లగ్జరీ మోడల్ కార్లను ఆవిష్కరించారు.
3/6
మహీంద్రా కంపెనీ నిర్వాహకులు శ్రీకాంత్‌కు స్వాగతం పలికారు. మహీంద్రా నుంచి బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.
4/6
త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంఛిగ్ చేస్తున్నట్లు మహీంద్రా కంపెనీ నిర్వాహకులు ప్రకటించారు.
5/6
మార్కెట్‌కు అందుకనుగుణంగా మహీంద్రా కంపెనీ ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
6/6
తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. మార్కెట్‌కు మంచి అధునాతన మోడళ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని నటుడు శ్రీకాంత్ తెలిపారు
Updated at - Feb 09 , 2025 | 07:23 AM