అవనిపై హరివిల్లు
ABN, Publish Date - Jan 06 , 2025 | 12:51 PM
ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి సంక్రాంతి ముత్యాల ముగ్గులు పోటీలు నిజామాబాద్

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహించిన సంతూర్ ముత్యా ల ముగ్గుల పోటీలు..

గార్డెనింగ్ పార్ట్నర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్ట్నర్ డిగ్నల్ వారి సెల్సి యా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సప్తవర్ణాల శోభితంగా సాగాయి.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబింపజేసే విధం గా మహిళలు ముగ్గులు వేశారు.

జిల్లా కేంద్రం లోని పాత కలెక్టరేట్ మైదానంలో ఎస్ఎస్ఆర్ కళాశాల సౌజన్యంతో నిర్వహించిన సంతూర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలో మహిళలు.

యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. పల్లె వాతావరణాన్ని పండుగలో ఔనత్యాన్ని చాటి చెబుతూ మహిళలు ముగ్గులు వేశారు.

భావిత రాల వారికి ముగ్గుల ప్రాధాన్యతను తెలుపుతూ చుక్కల ముగ్గులు వేసి అందులో వివిధ రంగులను నింపి సృజనాత్మకత ప్రదర్శించారు.

నగరంలో మొదటి బహుమతి పొందిన ముగ్గు. ప్రధమ బహుమతి అందజేస్తున్న తహెర్బన్
Updated at - Jan 06 , 2025 | 12:55 PM