H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు

ABN, Publish Date - Sep 23 , 2025 | 01:46 PM

హెచ్ 1బీ వీసా ఫీజు పెరిగినా, భారతీయులకు ఇతర ఆప్షన్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఓ1, ఈబీ5, ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సహా అనేకం ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 1/7

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 21 నుంచి కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుకు $100,000 (సుమారు రూ.85 లక్షలు) ఫీజు విధించారు. ఈ ఫీజు కేవలం విదేశాల నుంచి దరఖాస్తు చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే వీసా కలిగినవారు, రెన్యూవల్ లేదా ఎక్స్‌టెన్షన్ కోరుకునేవారు ఈ ఫీజు నుంచి మినహాయించబడ్డారు.

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 2/7

హెచ్ 1బీ అనేది అమెరికా కంపెనీలు నిర్దిష్ట నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఉపయోగించే వీసా. ఇది 3 నుంచి 6 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ వీసా కలిగినవారిలో భారతీయులు 70 శాతం మంది ఉన్నారు.

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 3/7

ఎల్1 వీసా విదేశీ కార్యాలయం నుంచి అమెరికా కార్యాలయానికి ఉద్యోగుల బదిలీ కోసం ఉపయోగపడుతుంది. ఇది ఎల్ 1ఏ (మేనేజర్లు/ఎగ్జిక్యూటివ్‌లు), ఎల్-1బీ (ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు) అని రెండు రకాలుగా ఉంటుంది.

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 4/7

ఎల్-1వీసా దరఖాస్తు ఫీజు $1,055 (సుమారు రూ. 92,000). ప్రీమియం ప్రాసెసింగ్ కోసం అదనంగా $2,805 (సుమారు రూ. 2.5 లక్షలు). లీగల్ ఫీజు రూ. 4.4 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంటుంది. దరఖాస్తుదారు విదేశీ కంపెనీలో కనీసం ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి. కంపెనీ తప్పనిసరిగా అమెరికా, విదేశాలలో కార్యాలయాలు కలిగి ఉండాలి. ఎల్1బీ కోసం ప్రత్యేక నైపుణ్యం అవసరం.

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 5/7

ఓ1 వీసా సైన్స్, కళలు, విద్య, వ్యాపారం లేదా క్రీడలలో నైపుణ్యం కలిగిన వారి కోసం. జాతీయ లేదా అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవారికి ఈ వీసా అనుకూలం. ఓ1 వీసా ఖర్చు $1,055 (సుమారు రూ. 92,000), ప్రీమియం ప్రాసెసింగ్ $2,805 (సుమారు రూ. 2.5 లక్షలు). లీగల్ ఫీజు రూ. 4.8 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు. 2025 నుంచి వీసా ఇంటిగ్రిటీ ఫీజు $250 (సుమారు రూ. 22,000).

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 6/7

ఈబీ5 వీసా. ఇది అమెరికాలో పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు సృష్టించే వారికి శాశ్వత నివాసాన్ని కల్పిస్తుంది. టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా (టీఈఏ)లో $800,000 (సుమారు రూ. 70.4 లక్షలు) లేదా సాధారణ ప్రాంతంలో $1,050,000 (సుమారు రూ. 92 లక్షలు) పెట్టుబడి అవసరం.

H1B Visa Alternatives: హెచ్-1బీ ఫీజు పెరిగినా నో టెన్షన్..ఇవిగో మార్గాలు 7/7

ఓపీటీ అనేది ఎఫ్-1 విద్యార్థి వీసా కలిగినవారికి వారు అధ్యయన రంగంలో పని అనుభవం పొందేందుకు అనుమతిస్తుంది. ఇది 12 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్‌లకు అదనంగా 24 నెలలు ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. ఓపీటీ దరఖాస్తు ఫీజు $520 (సుమారు రూ. 45,500). విద్యార్థి కనీసం ఒక అకడమిక్ ఇయర్ పూర్తి చేసి ఉండాలి.

Updated at - Sep 23 , 2025 | 01:46 PM