చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ

ABN, Publish Date - Dec 04 , 2025 | 12:25 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు(డిసెంబర్ 4న) అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో మధ్యప్రదేశ్‌ ముడేళ్ల క్రితం చిరుత ప్రాజెక్ట్ బహుమతిని అందుకుంది. నమీబియా నుండి కునో జాతీయ ఉద్యానవనానికి 8 చిరుతలను తీసుకువచ్చారు. ప్రస్తుతం, కునో పాల్పూర్, గాంధీ సాగర్ అభయారణ్యంలో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ 1/6

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(డిసెంబర్ 4న) అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో మధ్యప్రదేశ్‌ ముడేళ్ల క్రితం చిరుత ప్రాజెక్ట్ బహుమతిని అందుకుంది.

చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ 2/6

నమీబియా నుండి కునో జాతీయ ఉద్యానవనానికి 8 చిరుతలను తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో పాల్పూర్, గాంధీ సాగర్ అభయారణ్యంలో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ 3/6

భూమి మీద అత్యంత అద్భుతమైన జీవుల్లో ఒకటైన చిరుతను రక్షించడానికి అంకితభావంతో ఉన్న వన్యప్రాణుల ప్రేమికులు, పరిరక్షకులందరికీ విషెష్ అంటూ అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ప్రధాని పోస్ట్ పెట్టారు.

చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ 4/6

మూడేళ్ల క్రితం ఈ అద్భుతమైన జంతువును రక్షించామని, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిందని మోదీ తెలిపారు.

చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ 5/6

గతంలో కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి, మన జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ఇది ఒక ప్రయత్నమంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ 6/6

అనేక చిరుతలకు భారత్ నిలయంగా ఉండటం గర్వంగా ఉందని, అలానే అవి గణనీయమైన సంఖ్యలో భారత గడ్డపై జన్మించాయని తెలిపారు.

Updated at - Dec 04 , 2025 | 12:25 PM