CM Nitish kumar: బిహార్‌లో కొలువు తీరిన నితీశ్ సర్కార్..
ABN, Publish Date - Nov 20 , 2025 | 09:14 PM
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా జేడీ (యూ) అధినేత నితీశ్ కుమార్ గురువారం పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్ కుమార్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు.
1/4
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా జేడీ (యూ) అధినేత నితీశ్ కుమార్ గురువారం పదోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్ కుమార్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేల చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి.
2/4
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతోపోటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
3/4
ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
4/4
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఈ అసెంబ్లీ ఫలితాలు నవంబర్ 14న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 202 సీట్లు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్క స్థానాన్ని సైతం కైవసం చేసుకోకపోవడం గమనార్హం.
Updated at - Nov 20 , 2025 | 09:14 PM