Vaikuntha Ekadashi: హైదరాబాద్‌లోని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ
ABN, Publish Date - Dec 30 , 2025 | 10:54 AM
Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ఆ మహా విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించి పోతున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా మహా విష్ణువును దర్శించుకుంటే మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భారీగా భక్తులు తరలివస్తుండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆయా ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
1/9
హైదరాబాద్‌లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ
2/9
తెల్లవారుజామునే తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
3/9
వేకువజామునే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.
4/9
ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు
5/9
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డలోని దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
6/9
భక్తులతో నిండిపోయిన క్యూ లైన్లు.
7/9
వైకుంఠ ద్వారం ద్వారా మహా విష్ణువును దర్శించుకుంటే మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
8/9
ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణువును దర్శించుకుని భక్తులు పరవశించిపోతున్నారు.
9/9
స్వామి దర్శనం అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్న ఆలయ సిబ్బంది.
Updated at - Dec 30 , 2025 | 10:54 AM