Rathasapthami vedukalu: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు
ABN, Publish Date - Feb 04 , 2025 | 08:42 PM
Rathasapthami vedukalu in Arasavalli: శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య నారాయణుడిని పూజించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు.

స్వామి వారిని దర్శించుకొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు దంపతులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడిని దర్శించుకొనేందుకు భక్తులతోపాటు ప్రముఖులు సైతం పోటెత్తారు.

స్వామి వారిని దర్శించుకొనేందుకు వస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్

స్వామి వారి దర్శనం కోసం సంప్రదాయ దుస్తుల్లో వస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే గొండు శంకర్

దేవాలయం వద్ద భక్తులకు పాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే గొండు శంకర్

సూర్య భగవానుడిని దర్శించుకొనేందుకు వచ్చిన అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ ఎమ్మెల్సీ వరుధు కళ్యాణి

దేవాలయం వద్ద క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్

క్యూ లైన్లలో భక్తులతో మాట్లాడుతోన్న జిల్లా ఎస్పీ కె వి మహేశ్వర రెడ్డి
Updated at - Feb 04 , 2025 | 08:53 PM