Jagannath Rath Yatra 2025: ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:46 PM
ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాలను జగన్నాథుడి భక్తులు పూరీ చేరుకున్నారు. దీంతో పూరీ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుక కోసం ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రథయాత్ర జూన్ 27వ తేదీన మొదలై.. జులై 8వ తేదీన ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ప్రతి ఏటా పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ఇలానే జరుగుతూ వస్తుంది.

పూరీలో రథయాత్రకు రంగం సిద్ధమైంది. ఈ రథయాత్ర కోసం పూరీ విచ్చేసిన లక్షలాది మంది భక్తులు.

జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రను రథయాత్రలో భాగంగా గుండిచా ఆలయం వరకు భక్తులు లాగుతారు.

పూరీ జగన్నాథుడి రథయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జై జగన్నాథ అంటూ.. పూరీ సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని సుదర్శన పట్నాయక్ నిర్మించారు.

పూరీ జగ్ననాథుడి రథయాత్రకు తరలి వస్తున్న భక్తులు.

రథయాత్ర సందర్బంగా పూరీలో ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు. నృత్యం చేస్తున్న మహిళలు.

ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి పూరీకి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. వారిని కట్టడి చేస్తున్న భద్రతా సిబ్బంది.
Updated at - Jun 27 , 2025 | 03:46 PM