Upamaka venkateshwara swamy: వైభవంగా ఉపమాక వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
ABN, Publish Date - Mar 11 , 2025 | 11:55 AM
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. కల్యాణోత్సవంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అతి ప్రాచీనమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రం కల్యాణశోభతో కాంతులీనుతోంది.

శ్రీవారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంకురార్పణ, అశ్వ వాహన సేవతో స్వామివారి కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి.

సోమవారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు నిర్వహించారు.

కల్యాణోత్సవాల సందర్భంగా సోమవారం హోం మంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబం, పలువురు అధికారులు శ్రీవారి కల్యాణంలో పాలుపంచుకున్నారు.

ఆలయ నిర్వాహకులతో హోంమంత్రి వంగలపూడి అనిత

ఆలయంలో స్వామివారికి మొక్కుతున్న హోంమంత్రి అనిత

కల్యాణాన్ని వీక్షిస్తున్న హోంమంత్రి అనిత

హోంమంత్రి అనితకు ఆలయ కమిటీ నిర్వాహకులు వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటం అందజేశారు.
Updated at - Mar 11 , 2025 | 11:59 AM