Chittaramma Jatara: భక్తుల కొంగుబంగారం.. చిత్తారమ్మ దేవి
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:45 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో కొలువై భక్తుల కొంగుబంగారంగా భావించే చిత్తారమ్మదేవి జాతర కన్నుల పండువగా జరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి 17 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ జాతర జరుగుతోంది. 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేలా దేవాలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో కొలువై భక్తుల కొంగుబంగారంగా భావించే చిత్తారమ్మదేవి జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలో కొలువై భక్తుల కొంగుబంగారంగా భావించే చిత్తారమ్మదేవి జాతర కన్నుల పండువగా జరుగుతోంది.

సుమారుగా 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు చెబుతున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

జాతరకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

జాతరలో ఏర్పాటు చేసిన స్టాల్స్, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్, జారుడు స్పాంజ్‌లు చిన్నపిల్లలను అలరించాయి.

అమ్మవారి చల్లని దీవెనలతో జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులకు, ఆలయ సిబ్బందికి చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

భక్తుల కోసం జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైద్యసేవలు, టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి గాజులరామారానికి ప్రతి అరగంటకు ఒక స్పెషల్ బస్సు నడిపారు.

జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఉదయం నుంచే ఆలయం వద్ద జీడిమెట్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated at - Jan 20 , 2025 | 05:08 PM