దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - Feb 03 , 2025 | 06:40 AM
దేవుని కడపలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

దేవుని కడపలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

కడప నగరానికి ఉత్తర దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో దేవుని కడప ఉంది.

ఇక్కడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారు కొలువై ఉన్నారు.ఈ ఆలయానికి ఎడమవైపు శ్రీ పద్మావతిదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Updated at - Feb 03 , 2025 | 07:33 AM