Chhaava In Telugu: తెలుగులో వచ్చేస్తున్న ‘ఛావా’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ABN, Publish Date - Feb 26 , 2025 | 05:56 PM
బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘ఛావా’ ఇప్పుడు తెలుగు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీని డబ్ చేసి తెలుగులో విడుదల చేయనుంది గీతా ఆర్ట్స్.

తెలుగులోకి ‘ఛావా’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన గీతా ఆర్ట్స్

సంచలన విజయం సాధించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’ తెలుగులోకి వచ్చేస్తోంది.

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కుల్ని గీతా ఆర్ట్స్ సంస్థ దక్కించుకుంది.

మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉండనుందని గీతా ఆర్ట్స్ వెల్లడించింది.

‘ఛావా’ను థియేటర్లలో వీక్షించాలని.. మూవీని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితిగాథ ఆధారంగా ‘ఛావా’ను తెరకెక్కించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.

సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ఇందులో ఔరంగజేబుగా యాక్ట్ చేశారు.
Updated at - Feb 26 , 2025 | 05:56 PM