Nara Lokesh In Visakhapatnam: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన

ABN, Publish Date - Oct 12 , 2025 | 12:31 PM

విశాఖపట్నంలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు విశాఖపట్నం చేరుకున్న మంత్రి నారా లోకేశ్‌కు జిల్లా అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

Nara Lokesh In Visakhapatnam: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన 1/5

విశాఖపట్నం నగరంలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మధురవాడలోని ఐటీ పార్క్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు మంగళ వాయిద్యాల మధ్య సంస్థ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.

Nara Lokesh In Visakhapatnam: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన 2/5

అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.

Nara Lokesh In Visakhapatnam: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన 3/5

నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది.

Nara Lokesh In Visakhapatnam: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన 4/5

రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను సిఫీ అభివృద్ధి చేయనుంది.

Nara Lokesh In Visakhapatnam: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు లోకేశ్ శంకుస్థాపన 5/5

ఈ సంస్థల ఏర్పాటు వల్ల వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. భీమిలి నియోజకవర్గంలోని రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (Sify Infinit Spaces Limited) ఏర్పాటు చేసే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Updated at - Oct 12 , 2025 | 12:31 PM