Republic day: అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:20 PM
ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.

సాయుధ దళాల కవాతు అనంతరం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను గవర్నర్ ఎగరవేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏడు నెలలకు ముందు ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని గవర్నర్ చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను డైవర్ట్ చేయడంతో ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు.

ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, 93 శాతం స్రైక్ రేట్‌తో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని గౌవర్నర్ పేర్కొన్నారు.

పోలవరం, రాజధాని అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఏపీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా చేస్తున్నారని అబ్దుల్ నజీర్ చెప్పారు.

స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని, ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ చెప్పారు.

ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు నారా లోకేశ్, సవిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.
Updated at - Jan 26 , 2025 | 01:20 PM