మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ

ABN, Publish Date - Dec 14 , 2025 | 08:47 PM

తిరుపతి - రేణిగుంట జాతీయ రహదారిపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, బీజేపీ నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్, జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 1/8

తిరుపతి - రేణిగుంట జాతీయ రహదారిపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ఆవిష్కరించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 2/8

అనంతరం సీఎం ధామీ మాట్లాడుతూ.. పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్‌పేయి జీవితం అందరికీ నేర్పిస్తుందన్నారు. పోక్రాన్ అణు పరీక్షల నుంచి దేశ అభ్యున్నతి కోసం ఆయన చేసిన ప్రతి ప్రయత్నం అనన్య సామాన్యమైనదని పేర్కొన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 3/8

అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగుల కోసమే ఆయన ఆలోచించేవారని వివరించారు. వాజ్‌పేయి ఆదర్శాలను కొనసాగిస్తూ.. ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ దిశగా దేశాన్ని నడుపుతున్నారని చెప్పారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 4/8

ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 5/8

ఉత్తరాఖండ్ సీఎంను ఏపీ బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 6/8

ఆధునిక విమానాశ్రయాలు, గగన్‌యాన్, చంద్రయాన్, వందేభారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఆశ్చర్య పోయేలా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని సీఎం ధామీ ప్రశంసించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 7/8

ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు భారీగా తరలి వచ్చారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ సీఎం ధామీ 8/8

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, బీజేపీ నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, టీడీపీ నేతలు బొజ్జల సుధీర్ రెడ్డి, నరసింహ యాదవ్, జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Dec 14 , 2025 | 08:51 PM