Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు

ABN, Publish Date - Aug 16 , 2025 | 10:08 PM

స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు వినియోగించుకొంటున్నారు. అందులోభాగంగా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 1/10

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తోంది.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 2/10

అందులోభాగంగా ఆగస్టు 15వ తేదీ.. శుక్రవారం స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 3/10

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 4/10

అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 5/10

దీంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఈ పథకం ప్రారంభించడం ద్వారా కలిగింది.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 6/10

ఈ పథకం కారణంగా.. శనివారం ఉదయం రాష్ట్రంలోని పలు బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో నిండిపోయాయి.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 7/10

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం బస్టాండ్లు.. మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 8/10

మహిళా ప్రయాణికుల దృష్ట్యా మరిన్ని బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు అదనపు బస్సులు నడుపుతున్నారు.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 9/10

గుర్తింపు కార్డులు.. సెల్ ఫోన్‌లోని చూపిస్తుండడంతో.. మహిళలకు కండక్టర్లు అవగాహాన కల్పిస్తున్నారు.

Stree Sakthi: స్త్రీ శక్తి సూపర్ హిట్.. బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు 10/10

అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించాలంటే.. గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలంటూ మహిళలకు ఆర్టీసీ సిబ్బంది వివరిస్తున్నారు.

Updated at - Aug 16 , 2025 | 10:10 PM