చంద్రమౌళి భౌతిక కాయానికి పవన్ కల్యాణ్ నివాళి

ABN, Publish Date - Apr 25 , 2025 | 07:17 AM

విశాఖ: పహల్గాంలో ఉగ్రవాద దుశ్చర్యలో మృతిచెందిన విశాఖ వాసి చంద్రమౌళి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గురువారం రాత్రి పరామర్శించారు. ముందుగా జిల్లా పరిషత్‌ జంక్షన్‌ దగ్గరున్న కనకదుర్గ ఆస్పత్రిలో చంద్రమౌళి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పాండురంగాపురంలో ఉన్న చంద్రమౌళి నివాసానికి వెళ్లి ఆయన భార్య నాగమణి, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated at - Apr 25 , 2025 | 07:17 AM