టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్..

ABN, Publish Date - May 26 , 2025 | 07:54 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కుప్పంలో గృహప్రవేశం నిమిత్తం గత రెండురోజులుగా బిజీబిజీగా ఉన్నారు. కడపలో జరుగుతున్న మహనాడుకు బయలుదేరారు లోకేష్‌. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం శాంతిపురం వద్ద ఆగారు. అక్కడ కాసేపు ఆగి టీ తాగారు యువనేత. ఈ సందర్భంగా టీకొట్టు యజమాని చెంగాచారితో మాట్లాడారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 1/11

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కుప్పంలో గృహప్రవేశం నిమిత్తం గత రెండురోజులుగా బిజీబిజీగా ఉన్నారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 2/11

కడపలో జరుగుతున్న మహనాడుకు బయలుదేరారు నారా లోకేష్‌.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 3/11

ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం శాంతిపురం వద్ద నారా లోకేష్‌ ఆగారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 4/11

అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లారు. అన్నా... చాలా దూరం వెళ్లాలి... టీ ఇస్తావా అని అడిగారు నారా లోకేష్‌.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 5/11

చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తన అభిమాననేత నేరుగా కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 6/11

యువనేత లోకేష్‌కు టీ గ్లాసు అందించారు. వ్యాపారం ఎలా ఉందని చెంగాచారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు యువనేత.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 7/11

నారా లోకేష్‌తో చెంగాచారి మాట్లాడారు. ‘సర్.. నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. నేను టీడీపీకి చెందిన వాడినన్న కోపంతో గత ఐదేళ్లుగా నా టీ అంగడిని మూయించేశారు’ అని చెంగాచారి ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 8/11

‘గత ఏడాది జూన్ 12న చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వతేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించాను. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది. మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా’ అంటూ చెంగాచారి భావోద్వేగానికి గురయ్యారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 9/11

యువనేత లోకేష్ చెంగాచారి భుజం తట్టి ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని తెలిపారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 10/11

ఏ అవసరమొచ్చినా తనకు ఫోన్ చేయాలని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

టీడీపీ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన మంత్రి లోకేష్.. 11/11

కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తారనడానికి ఇదొక మచ్చుతునక అని స్థానిక టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.

Updated at - May 26 , 2025 | 10:31 PM