Minister Nara Lokesh: బెంగళూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ

ABN, Publish Date - Jul 09 , 2025 | 08:27 AM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం బెంగళూరులో పర్యటించారు. పలువురు ప్రముఖులని లోకేష్ కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్, ప్రెస్టేజ్ గ్రూప్, సత్వ గ్రూప్‌ ప్రతినిధులతో పెట్టుబడుల గురించి మాట్లాడారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలకు ఆయా సంస్థల నిర్వాహకులు అంగీకారం తెలిపారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 1/17

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న(మంగళవారం) బెంగళూరులో పర్యటించారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 2/17

పలువురు ప్రముఖులని లోకేష్ కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్, ప్రెస్టేజ్ గ్రూప్, సత్వ గ్రూప్‌ ప్రతినిధులతో పెట్టుబడుల గురించి మాట్లాడారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలకు వారు అంగీకారం తెలిపారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 3/17

గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCS) స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ANSR సంస్థ విశాఖపట్నంలో GCCS కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించడానికి ఏపీ ప్రభుత్వంతో తన సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 4/17

బెంగళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ANSR సంస్థ మధురవాడ IT క్లస్టర్‌లో అత్యాధునిక GCC ఇన్నోవేషన్ క్యాంపస్‌ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 5/17

దేశంలో పేరెన్నిగన్న దిగ్గజ జిసిసి సంస్థల ప్రతినిధులతో కలిసి బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్ .

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 6/17

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందని వెల్లడించారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తిచేశారు మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 7/17

అలాగే ప్రెస్టేజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జాయాద్ నోమాన్ లతో బెంగుళూరులో భేటీ అయినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 8/17

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రెస్టేజ్ గ్రూప్ ప్రతినిధులను విజ్ఞప్తి చేశానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 9/17

ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సుమారు రూ.65వేల కోట్లతో రాజధాని అమరావతిలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 10/17

గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారుతోందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం కలిగిన ఏపీ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ప్లగ్ అండ్ ప్లే మోడల్ ప్రిబిల్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 11/17

విశాఖపట్నంలో రూ.1500 కోట్లతో ఏపీలో పెట్టుబడి పెట్టడానికి సత్వ గ్రూప్‌ ముందుకు వచ్చింది.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 12/17

ఈ సందర్భంగా సత్వ గ్రూప్‌ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 13/17

సత్వ గ్రూప్‌ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 14/17

అన్ని మౌలిక సదుపాయాలకు ఏపీ అనుసంధానంగా ఉంటుందని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 15/17

స్మార్ట్ లివింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీని తీర్చిదిద్దుతామని అన్నారు మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 16/17

సత్వ గ్రూప్‌‌తో ఏపీకి ఎంతో ప్రయోజనకరమని, విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలిపారు మంత్రి నారా లోకేష్.

Minister Nara Lokesh: బెంగళూరులో  మంత్రి నారా లోకేష్ పర్యటన.. ఏపీలో పెట్టుబడులపై చర్చ 17/17

సత్వ గ్రూప్‌‌తో ఏపీలో 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Updated at - Jul 09 , 2025 | 08:34 AM