శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు

ABN, Publish Date - Dec 22 , 2025 | 02:00 PM

సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యుల బృందం దర్శించుకుంది. సోమవారం ఉదయం స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న ఈ బృందానికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు 1/5

సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యుల బృందం దర్శించుకుంది. సోమవారం ఉదయం స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న ఈ బృందానికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు 2/5

అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అంతరాలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని వారు దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు 3/5

స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ మండపంలో క్రీడాకారిణులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంలతో ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు 4/5

స్వామి వారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణులు ​స్మృతి మంధాన,​ హర్మన్ ప్రీత్ కౌర్, ​రేణుక సింగ్, ​షఫాలీ వర్మ, ​వైష్ణవి శర్మ, ​అమర్ ప్రీత్ కౌర్,​ క్రాంతి గౌడ్,​ శ్రీ చరణి, ​అంపైర్ డి.ఎస్. లక్ష్మి, బృందా రాతి తదితరులు ఉన్నారు.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు 5/5

దేశానికి మరిన్ని విజయాలు చేకూరాలని, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు. ఈ క్రీడాకారిణులకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి. తిరుమలేశ్వరావు, పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Updated at - Dec 22 , 2025 | 02:11 PM