కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై సమస్యలకు పరిష్కారం అక్కడే..
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:07 PM
కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించేందుకు వీలుగా ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

కుప్పం నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకుని వినతిపత్రాలు సమర్పించేందుకు వీలుగా ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసేలా వెబ్‌సైట్‌ను సైతం రూపొందించారు.

ప్రజల ఫిర్యాదులు స్వీకరించి ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే అంశాలను అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు.

అనంతరం ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కార్యక్రమానికి ముందు టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు మహిళలు హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.
Updated at - Jan 07 , 2025 | 05:07 PM