AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ

ABN, Publish Date - Nov 21 , 2025 | 06:56 AM

మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యంగా అన్ని విభాగాలకు చెందిన పోలీసు బలగాలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రంపచోడవరంలో మంగళ, బుధవారాల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆపరేషన్ సంభవ్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రెండు ఘటనల్లో 13 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారని తెలిపారు. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 1/9

మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యంగా అన్ని విభాగాలకు చెందిన పోలీసు బలగాలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రంపచోడవరంలో మంగళ, బుధవారాల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 2/9

అనంతరం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆపరేషన్ సంభవ్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రెండు ఘటనల్లో 13 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారని తెలిపారు. ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 3/9

ఈ ఏడాది జూన్‌లోనే మావోయిస్టులందర్నీ లొంగిపోవాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 4/9

మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన హిడ్మా, టెక్ శంకర్‌తోపాటు వారి అనుచరులు ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారన్నారు. ఇది పోలీసుల విజయంగా డీజీపీ అభివర్ణించారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 5/9

ఈ ఘటనల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 6/9

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తలదాచుకున్న 50 మందిని అరెస్టు చేశామని చెప్పారు. వారిలోనూ ముఖ్యులున్నారని పేర్కొన్నారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 7/9

రాష్ట్రంలో మావోయిస్టులు ఇప్పుడు దాదాపుగా లేనట్లేనని ఆయన చెప్పారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 8/9

మావోయిస్టు పార్టీ కీలక నేత దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. లేరని డీజీపీ సమాధానం ఇచ్చారు.

AP DGP Gupta: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ 9/9

ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభించిన ఆయుధాలను ప్రదర్శించారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో రంప చోడవరంకు డీజీపీ గుప్తా చేరుకున్నారు.

Updated at - Nov 21 , 2025 | 06:57 AM