కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం

ABN, Publish Date - Dec 04 , 2025 | 06:21 PM

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని పేర్కొన్నారు.

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం 1/6

చిత్తూరులో కూటమి పార్టీల నాయకులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం 2/6

చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం 3/6

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలమని, 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని పేర్కొన్నారు.

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం 4/6

వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని.. క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారుదామని నేతలకు సూచించారు.

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం 5/6

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని డిప్యూటీ సీఎం తెలిపారు.

కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం 6/6

సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణమని, నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయని కూటమి నేతలకు సూచించారు.

Updated at - Dec 04 , 2025 | 06:22 PM