CM Chandrababu : కొత్త ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు ఫోకస్
ABN, Publish Date - Mar 11 , 2025 | 01:03 PM
హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలో.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీ’ని స్థాపించే దిశగా అడుగులు పడుతున్నాయి.

హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలో.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీ’ని స్థాపించే దిశగా అడుగులు పడుతున్నాయి.

రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం వెలగపూడి సచివాలయంలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఎల్ అండ్ టీ చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్ తదితరులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు.

ఏపీలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి అనువైన చర్యలు చేపట్టడంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

ఏపీలో యువతకు క్వాంటమ్ టెక్నాలజీలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలతో సహా.. రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి దోహదపడేలా ఈ వ్యాలీ నిర్మాణం సాగేలా చర్యలు చేపట్టాలని ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Updated at - Mar 11 , 2025 | 01:04 PM