ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 11 , 2025 | 10:24 PM

భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలని ఆయన సూచించారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  1/10

భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలని ఆయన సూచించారు. 2

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  2/10

సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా చూస్తే గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తి.. దాని రూపొందించిన పింగళి వెంకయ్య అని తెలిపారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  3/10

జెండా కేవలం వస్త్రమే కాదు... స్వాతంత్య్రానికి ప్రతీక అని ఆయన వివరించారు.స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వాతంత్ర్య సమరయోధులు పోరాడారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  4/10

దేశ సమగ్రత, భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నామన్న విషయం ప్రపంచానికి చాటామని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  5/10

దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వ, రక్షణ విషయంలో ఎవరి ముందు భారతదేశం తలవంచదన్నారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  6/10

ఇప్పుడున్నది బలమైన, దృఢమైన భారతదేశమని ఆయన ఆభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్య పోయిందని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  7/10

మనం ఎవరి జోలికి వెళ్లం.. ఎవరైనా మన జోలికి వస్తే ఊరుకోమనేది ఆపరేషన్ సింధూర ద్వారా ప్రపంచానికి తెలియజేశామని సీఎం చంద్రబాబు వివరించారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  8/10

మనల్ని కాపాడే సైనికులకు ఎప్పుడు సెల్యూట్ చేయాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు. భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందన్నారు

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  9/10

2028 కల్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచంలో మూడో స్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన ఈ జాతీయ జెండా ఉండాలి: సీఎం చంద్రబాబు  10/10

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా డెడ్ ఎకానమీ అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరిది డెడ్ ఎకానమియో భవిష్యత్తులో తెలుస్తోందని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌కు సవాల్ విసిరారు. భారతదేశం లేకపోతే కొన్ని దేశాలు అభివృద్ధికి సైతం నోచుకోవని ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం అత్యున్నతమైనదని చంద్రబాబు ప్రశంసించారు.

Updated at - Aug 11 , 2025 | 10:24 PM