గుంటూరులో భోగి సంబరాలు..
ABN, Publish Date - Jan 13 , 2025 | 07:08 PM
హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయం ప్రకారం, మకర సంక్రాంతికి ముందు రోజున భోగి పండుగ వస్తుంది.

తెలుగునాట పెద్ద పండుగగా జరుపునే సంక్రాంతిని మొదటిరోజు 'భోగి' పండుగగా జరుపుకుంటారు.

దక్షిణాయణంలో సూర్యుడు రోజు రోజుకూ భూమికి దూరమవడం వలన చలి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది.

చలిని తట్టుకోవడానికి ప్రజలంతా పెద్దగా మంటలు వేసుకుంటారు. కాల క్రమంలో అదే బోగి, మంటలుగా ప్రజల సంప్రదాయంలో భాగమైపోయాయి.

తాము ఇప్పటి వరకూ పడిన కష్టాలను, బాధలను అగ్నికి ఆహుతి ఇచ్చి రాబోయే ఉత్తరాయణంలో తమకు సుఖ సంతోషాలను ఇవ్వాలని కోరుతూ భోగి మంట్లో వేడుకుంటారు.

హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయం ప్రకారం, మకర సంక్రాంతికి ముందు రోజున భోగి పండుగ వస్తుంది.

సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని 'మతం' 'సంక్రాంతి' అంటారు.

ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు 'బోగీ' పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి జనవరి 3, సోమవారం నాడు వచ్చింది.

భోగి రోజు నుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ సందళ్లు తారా స్థాయికి చేరతాయి.

దాదాపు నెలరోజులపాటు ధనుర్మాస పూజా కార్యక్రమాలు నిర్వహించి భోగి పండుగతో సంక్రాంతి. వేడుకల్లోకి ప్రవేశిస్తారు.

ధనుర్మాసంలో మహిళలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. యశోదా తనయుడుకి బాల భోగం సమర్పించి హారతి ఇస్తారు.

ఆడపిల్లలు నెలరోజులూ ఇళ్ల ముంగిట్లో కళ్లాపు జల్లి రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది గొబ్బెమ్మలు పెట్టి, బంతి, చామంతి, తంగేడు, గుమ్మడి పూలతో అలంకరిస్తారు.
Updated at - Jan 13 , 2025 | 07:12 PM