నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు..
ABN, Publish Date - Feb 27 , 2025 | 12:23 PM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ జరగనున్నది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకు ముగియనున్నది. అందుకు తగిన ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం పోలింగ్ జరగుతుంది.

ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు.

ఆరు జిల్లాల పరిధిలో 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు.

ఉన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, కేజీబీవీలు, రెసిడెన్సియల్, మోడల్ స్కూళ్లు, జూనియర్/డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, యూనివర్సిటీ కళాశాలల అధ్యాపకులు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన స్కూలు అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న టీచర్లు ఓటు హక్కును వినియోగించునుకోనున్నారు.

వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ సిబ్బందికి రెండు రోజుల్లో శిక్షణ ప్రారంభమవుతుంది.
Updated at - Feb 27 , 2025 | 12:24 PM