పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 23 , 2025 | 09:01 AM

విజయవాడలో ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలు సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు.

పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు 1/6

నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు మార్గాన్ని అందరూ అనుసరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచానికి శాంతి, ప్రేమ, దయ, కరుణ అందించిన క్రీస్తు మార్గంలో క్రైస్తవ సోదరులు, రాష్ట్ర ప్రజలు నడవాలని సూచించారు.

పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు 2/6

సోమవారం విజయవాడలో ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలు సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు.

పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు 3/6

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద పండుగ క్రిస్మస్‌ అని పేర్కొన్నారు. క్రైస్తవ సంఘాలు సమాజసేవలో కీలకంగా వ్యవహరిస్తాయని గుర్తు చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలు.. పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రుల తదితర సంస్థలు ప్రభుత్వాలు నిర్మించ లేని సమయంలో క్రైస్తవ సంఘాలు కట్టి చూపించాయని ప్రశంసించారు.

పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు 4/6

మాజీ సీఎం, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు సైతం క్రైస్తవ మిషనరీ పాఠశాలలోనే చదువుకున్నారని వివరించారు.

పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు 5/6

పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.5 వేలు ఇస్తున్నామన్నారు.

పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు 6/6

గత ప్రభుత్వం క్రైస్తవులను మోసం చేసి ఆ గౌరవ వేతనాన్ని మధ్యలోనే ఆపేసిందని విమర్శించారు. ఆ బకాయిలతో కలిపి రూ.60 కోట్ల నగదును క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్ 24వ తేదీ సాయంత్రానికి అకౌంట్లలో వేస్తామని సీఎం ప్రకటించారు. జెరూసలెం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయమందిస్తున్నామన్నారు. 2025-26లో రూ.20 కోట్లతో 2 వేల మంది క్రైస్తవులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

Updated at - Dec 23 , 2025 | 09:02 AM