లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

ABN, Publish Date - Dec 12 , 2025 | 08:35 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద శుక్రవారం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి తెలంగాణలోని భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి 1/4

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద శుక్రవారం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి 2/4

ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి తెలంగాణలోని భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి 3/4

బస్సులోని ప్రయాణికులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి 4/4

ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాద ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి హోం మంత్రి అనిత చేరుకుని క్షతగాత్రులతోపాటు మృతుల బంధువులతో మాట్లాడారు.

Updated at - Dec 12 , 2025 | 08:37 PM