Share News

IIPA: ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డు గ్రహితకు సౌదీలో ఐఐపీఏ సన్మానం

ABN , Publish Date - Jan 18 , 2025 | 09:14 PM

వైద్య రంగంలో నిపుణుడిగా పేరొంది ఏకంగా సౌదీ అరేబియా రాజ కుటుంబానికి వైద్యునిగా సేవలందించిన డాక్టర్ అన్వర్ ఖుర్షీద్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డుతో సత్కరించింది. ఆయనను ఐ.ఐ.పి.ఏ రియాద్‌లో సన్మానించింది.

IIPA: ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డు గ్రహితకు సౌదీలో ఐఐపీఏ సన్మానం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఇంటర్నేషనల్ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐ.ఐ.పి.ఏ) ... సౌదీ అరేబియా రాజధాని రియాధ్ కేంద్రంగా పని చేసే ప్రవాస భారతీయుల సంస్థ ప్రవాస భారతీయులలో వృత్తి నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తోంది.

ప్రచార ఆర్భాటాలకు దూరంగా, ఎంపిక చేసిన రంగాలలో స్థానికంగా అందుబాటులో ఉన్న నిష్ణాతులతో గోష్ఠులు, సదస్సులు నిర్వహిస్తూ మెళకువలు బోధించే ఐఐపీఏలో దేశవ్యాప్తంగా ప్రవాస భారతీయులు ఉన్నప్పటికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రముఖం.

ఈ సంవత్సరం వైద్య రంగంలో నిపుణుడిగా పేరొంది ఏకంగా సౌదీ అరేబియా రాజ కుటుంబానికి వైద్యునిగా సేవలందించిన డాక్టర్ అన్వర్ ఖుర్షీద్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఆవార్డుతో సత్కరించింది (NRI).


TASA: టాసా వెబ్‌సైట్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

2.jpg

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు (పీబీఎస్ఏ) అనేది విదేశీ గడ్డపై ఆయా రంగాలలో సేవలందించినందుకు గుర్తింపుగా భారతీయులకు అందించే అత్యున్నత గౌరవ పురస్కారం. ఇంట పద్మవిభూషణ్ బిరుదుకు ఉన్న గౌరవం బయట ప్రవాసీ భారతీయ సమ్మాన్ బిరుదుకు ఉంటుంది. విదేశాలలో వివిధ రంగాలలో తమ విశిష్ఠతను ప్రదర్శిస్తూ భారతీయతను ప్రతిబింబించే వృతి నిపుణులు, కొన్ని సార్లు సామాజిక సేవ చేసే ప్రవాస భారతీయులకు దీన్ని ప్రదానం చేస్తారు.

ఈ సందర్భంగా ఇటీవల రియాధ్ నగరంలోని ఒక ప్రఖ్యాత హోటల్‌లో ఐ.ఐ.పి.ఏ డాక్టర్ అన్వర్ ఖుర్షీద్‌ను సన్మానించింది. ఏ రంగంలో ఉన్నా తోటి భారతీయులకు సేవ చేయడం లక్ష్యంగా ప్రవాసీయులు ముందుకు కదలాలని అన్వర్ ఖుర్షీద్ ఉద్బోధించారు. పరస్పర గౌరవంతో కులమతాలకు అతీతంగా అందరు భారతీయులుగా ఐక్యమత్యంగా ఉండాలని చెబుతూ కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి ఎడారిలో పని చేసిన తాను 45 ఏళ్ళుగా సౌదీలో తనకు వీలైన విధంగా నిరంతరం వృత్తిపరంగా, సేవా పరంగా కృషి చేస్తున్నానని అన్నారు. తనకు సహకరించిన సౌదీ అరేబియా ప్రభుత్వానికి, తనకు అన్ని విధాలుగా సహకరించిన తోటి భారతీయులకు డాక్టర్ అన్వర్ ఖుర్షీద్ కృతజ్ఞతలు తెలిపారు.


UAE: యుఏఈలో సంక్రాంతి సంబరాలు

ఐ.ఐ.పి.ఏ అధ్యక్షుడు డాక్టర్ షఫీఖ్ అన్వర్ ఖుర్షీద్ నవతరానికి ఒక మార్గదర్శి అని ప్రశంసించారు. ప్రధాన కార్యదర్శి ఫర్హాన్ అహ్మద్ హాష్మీ సంస్థ కార్యకలాపాలను వివరించారు. యువకులకు వివిధ రంగాలలో తమ సంస్థ అందిస్తున్న శిక్షణ మరియు ఓరియంటేషన్ తరగతుల గురించి సంస్థ నాయకుడు సాదిఖ్ వివరించారు.

షాహీద్ మోహియోద్దీన్, మోహమ్మద్ సమీయోద్దీన్‌లు కూడా మాట్లాడారు. మీర్ ముజాహిద్ వందన సమర్పణ చేసారు.

Read Latest and NRI News

Updated Date - Jan 18 , 2025 | 09:43 PM