Share News

NRI: డల్లాస్‌లో డాకు మహారాజ్ సందడి.. క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం అందించిన బాలకృష్ణ యువసేన

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:11 PM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లకు సేవలందిస్తున్న బలవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ విరాళం అందించారు. బాలకృష్ణ యువసేన నాయకులు 38,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.33 లక్షలు) చెక్కును బాలకృష్ణకు అందజేశారు.

NRI: డల్లాస్‌లో డాకు మహారాజ్ సందడి.. క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం అందించిన బాలకృష్ణ యువసేన
Balakrishna Yuva Sena

సంక్రాంతికి సందడి చేసేందుకు నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన డాకు మహారాజ్ సినీమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో జరగ్గా.. బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డల్లాస్ నగరానికి వచ్చిన బాలకృష్ణకు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లకు సేవలందిస్తున్న బలవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ విరాళం అందించారు. బాలకృష్ణ యువసేన నాయకులు 38,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.33 లక్షలు) చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య యువసేన నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. విరాళాల సేకరణ విజయవంతం అవ్వడంలో ప్రముఖ వ్యాపారవేత్త గుళ్లపల్లి రామకృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగువారి సేవా గుణాన్ని ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రశంసించారు. టెక్సాస్ నగరంలో ఉంటున్న బాలకృష్ణ యువసేన నాయకులతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐలు తెలుగు రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారని గుళ్లపల్లి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ యువసేన నాయకులు సుధీర్ చింతమనేని, చందు కాజ, దిలీప్ కుమార్ చంద్ర, సాయి మద్దిరాల, చితరంజన్ కొసరాజు పాల్గొన్నారు.

Balakrishnaa and Ramakrishna.jpg


12న ప్రేక్షకుల ముందుకు..

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. బాబీ డియోల్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతోంది. అమెరికాలోని డల్లాస్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఇందులో వింటేజ్‌ బాలకృష్ణను ప్రజెంట్‌ చేశారు దర్శకుడు బాబీ. ‘అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయనను డాకు అనేవాళ్లు. మాకు మాత్రం ఆయన మహారాజ్‌’.. ‘ఆయన కింగ్‌ ఆఫ్‌ జంగిల్‌’ వంటి సంభాషణలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇందులో విభిన్నమైన గెటప్పుల్లో బాలకృష్ణ కనిపించారు. ఆయన లుక్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌, భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో నిండిన ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

Daku Maharaj Event.jpg

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 06 , 2025 | 06:00 PM