Share News

Indian Bride Trends: మేలిముసుగుతో మనోహరంగా

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:34 AM

మేలిముసుగు అనేది రాణితనానికి చిహ్నం. సంప్రదాయానికి ప్రతీక. అందుకే మేలిముసుగు లేకుండా పెళ్లికూతురి అలంకరణ పూర్తికాదు. యువరాణిలా పెంచుకున్న తమ కూతురిని మేలిముసుగులో చూసి మురిసిపోతుంటారు...

Indian Bride Trends: మేలిముసుగుతో మనోహరంగా

సంప్రదాయం

మేలిముసుగు అనేది రాణితనానికి చిహ్నం. సంప్రదాయానికి ప్రతీక. అందుకే మేలిముసుగు లేకుండా పెళ్లికూతురి అలంకరణ పూర్తికాదు. యువరాణిలా పెంచుకున్న తమ కూతురిని మేలిముసుగులో చూసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇలా వివాహం, సీమంతం, బిడ్డను ఉయ్యాలలో వేయడం లాంటి సంప్రదాయ వేడుకల్లో మేలిముసుగుకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయం.... ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు సంతరించుకుంటూ యువతులను, మహిళలను ఆకర్షిస్తోంది.

మేలిముసుగు ఎందుకు?

వివాహ వేడుకలో వధువుకు మేలిముసుగు ధారణ తప్పనిసరి. పలుచగా తేలికగా ఉండే అందమైన చున్నీ లేదా ఓణీని వధువు తలపై నుంచి భుజాల మీదుగా జాలువారేలా అమరుస్తారు. ఇది ఆమె గౌరవానికి, దర్పానికి, వినయానికి, సౌశీల్యానికి గుర్తుగా నిలుస్తుంది. వివాహ సమయంలో కలిగే భయం, బెరుకు, దుఖం లాంటి భావోద్వేగాలను దాచిపెడుతుంది. పెద్దవారి పట్ల పూజనీయత, వారినుంచి ఆశీస్సులు కోరే వినమ్రతను సూచిస్తుంది.

ట్రేండీగా ఇలా...

ఫ మేలిముసుగు కోసం పారదర్శకంగా మెరిసే వస్త్రాన్ని ఎంచుకోవాలి. టిష్యూ, ఆర్గంజా వస్త్రాలతో తయారుచేసినవాటిని యువతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెళ్లి చీర, బ్లౌజ్‌లకు మ్యాచ్‌ అయ్యేలా ఎంపిక చేసుకుంటున్నారు. చీరకు వెడల్పాటి పెద్ద అంచు ఉంటే దానికి సరిపోలేలా చూసుకుంటున్నారు. మేలిముసుగు ఎంత పలుచగా ఉంటే అంత అహ్లాదకరంగా కనిపిస్తుంది. రంగుల కలయికలా కాకుండా ఒకే రంగులో ఉంటే మరింత శోభనిస్తుంది. పొడవుగా నేలను తాకే మేలిముసుగు మీద వధూవరుల పేర్లు, చిన్న చిన్న పూలు, నక్షత్రాలు, చుక్కలు ఎంబ్రాయిడరీ చేసి అందుబాటులోకి తెస్తున్నారు. తళతళ మెరిసే తెల్లని రాళ్లను అతికించి సరికొత్త మేలిముసుగులను రూపొందిస్తున్నారు. రాత్రి సమయంలో వివాహం ముహూర్తం ఉన్న యువతులు వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. అచ్చం బంగారంలా మెరిసే మేలిముసుగు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.


ఎలా ఎంచుకోవాలంటే...

  • మేలిముసుగు తయారుచేసే వస్త్రం మందంగా ఉండకూడదు. వెడల్పాటి లేసులు, భారీ ఎంబ్రాయిడరీ వర్క్‌లు, జర్దోసి వర్క్‌లు ఉండకూడదు. వీటివల్ల మేలిముసుగు బరువు పెరుగుతుంది. ధరించినప్పుడు భారంగా అనిపిస్తుంది. పలుచగా, మెత్తగా, జాలువారేలా ఉండే మేలిముసుగులను మాత్రమే ఎంచుకోవాలి.

  • ఛాయ తక్కువగా ఉన్నవారు నెట్టెడ్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన మేలిముసుగును ధరిస్తే బాగుంటుంది. చీరకు భిన్నంగా ఉన్న రంగును ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు.

  • మంచి ఛాయతో ఉన్నవారు చీర రంగుతో మ్యాచ్‌ అయ్యే వాటిని ధరించవచ్చు.

  • నేలను తాకుతూ ఆకర్షణీయమైన రంగులో మెరిసే మేలిముసుగు అందరికీ చక్కగా నప్పుతుంది.

ఖ్యాతి,

ఖ్యాతి డిజైనర్‌ స్టూడియో హైదరాబాద్‌, 6300386749

ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jul 20 , 2025 | 03:34 AM