Share News

Raj Tarun interview: నిజ జీవితంలో చాలా ఇంట్రావర్ట్‌ని...

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:40 AM

ఈమధ్య కాలంలో రకరకాల వివాదాల్లో చిక్కుకున్న నటుల్లో రాజ్‌తరుణ్‌ ఒకరు. ఈ వివాదాలను పట్టించుకోకుండా ఆయన తన కెరీర్‌పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటు ఓటీటీల్లో, అటు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. గతంలో..

Raj Tarun interview: నిజ జీవితంలో చాలా ఇంట్రావర్ట్‌ని...

సండే సెలబ్రిటీ

ఈమధ్య కాలంలో రకరకాల వివాదాల్లో చిక్కుకున్న నటుల్లో రాజ్‌తరుణ్‌ ఒకరు. ఈ వివాదాలను పట్టించుకోకుండా ఆయన తన కెరీర్‌పైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటు ఓటీటీల్లో, అటు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. గతంలో హిట్‌ అయిన ఆయన సినిమా ‘కుమారి 21 ఎఫ్‌’ ఇటీవల రీ-రిలీజై... మంచి కనెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆయనతో ‘నవ్య’ ముఖాముఖి.

ఎలా ఉన్నారు? అన్ని గొడవల నుంచి బయటకు వచ్చినట్లేనా?

అన్నింటినుంచి బయటకు వచ్చేసా. ఈ మధ్య హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో ‘కుమారి 21 ఎఫ్‌’ చూడటానికి వెళ్లాను. ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్‌ చేస్తుంటే చాలా తృప్తిగా అనిపించింది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా బయటకు వెళ్లటం లేదు. ఈ తరహా అనుభవం కొత్తగా అనిపించింది.

మీరు ఎదుర్కొన్న గొడవలన్నింటిలో మీకు బాసటగా నిలిచిందెవరు?

అమ్మానాన్నలు, నా స్నేహితులతోపాటు సినిమాల పట్ల నాకున్న ప్రేమ నన్ను నడిపించింది. గొడవల వల్ల నేను, నా తల్లిదండ్రులు, స్నేహితులు... అందరం బాగా ఎఫెక్ట్‌ అయ్యాం. సినీనటుల జీవితంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. వారి గురించి ఎలాంటి అపవాదు వచ్చినా వెంటనే నమ్మేస్తారు. నిజం బయటకు వచ్చే సమయానికి జరిగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది. నా విషయంలోను అదే జరిగింది. అయితే నేను మీడియాలో రాసిన న్యూస్‌ చదవలేదు. టీవీల్లో, సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోలు చూడలేదు. నా స్నేహితులే వాటిని చూసేవారు. ఏం జరుగుతోందో చెప్పేవారు. వాస్తవానికి నిజ జీవితంలో కూడా నేను చాలా ఇంట్రావర్ట్‌ని. షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లిన వెంటనే ఎకా్ట్రవర్ట్‌గా మారిపోతా. నాకు సంబంధించిన గొడవల విషయంలో నేను ఇంట్రావర్ట్‌గానే ఉండిపోయాను.


గొడవల ప్రభావం సినిమాలపై ఉందా? ఇప్పుడు ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు?

ప్రభావం అస్సలు లేదండి. నేను నా సినిమాల బిజీలోనే ఉన్నాను. ‘రామ్‌భజరంగ్‌’ అనే సినిమా పాటలు తప్ప మిగిలినదంతా పూర్తయిపోయింది. ‘పాంచ్‌ మినార్‌’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం ‘చిరంజీవ’ అనే డైరక్ట్‌ ఫిల్మ్‌ చేశాను.

అది కూడా విడుదల కు సిద్ధంగా ఉంది. ‘కూర్మావతారం’ అనే సినిమా జరుగు తోంది. వీటితో పాటుగా తమిళ్‌లో... ప్రము ఖ సినిమాటో గ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇలా ప్రస్తుతం ఈ సినిమాల బిజీలో ఉన్నా.

ఓటీటీ వల్ల ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా?

కచ్చితంగా వచ్చింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. నా చిన్నప్పుడు డీవీడీలు రెంట్‌కు తీసుకొని చూసేవాళ్లం. ఒక్క రోజు లేట్‌ అయినా అదనంగా డబ్బులు కట్టాల్సి వచ్చేది. అందువల్ల దీక్ష పట్టినట్లు సినిమాను చూసేసేవాళ్లం. ఓటీటీ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు తప్పాయి. ప్రపంచంలోని రకరకాల సినిమాల మన ముందుకే వస్తున్నాయి. దీనివల్ల ప్రేక్షకుల జడ్జిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా నటీ నటులకు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఈ మధ్య ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ అనే సినిమా చూశాను. అద్భుతమైన ఎమోషన్స్‌ ఉన్న సినిమా. ఓటీటీలో చూసి, మళ్లీ థియేటర్‌లో కూడా చూశా. మా అమ్మనాన్నలను తీసుకువెళ్లి చూపించా.


3-navya.jpg

ఓటీటీల వల్ల థియేటర్లకు రావటం లేదనే వాదన నిజమంటారా?

అలా ఉండదు. నా ఉద్దేశంలో సినిమా బావుంటే చూడటానికి వస్తారు. లేకపోతే రారు. అయితే ఒకప్పుడు సినిమా యావరేజ్‌గా ఉన్నా చూసేసేవారు. కానీ ఇప్పుడు సినిమా చాలా బావుంటే తప్ప థియేటర్‌లో చూడటం లేదు. అంతేకాదు... ఓటీటీకి, మామూలు సినిమాకు మధ్య తేడా ఉంది. ఓటీటీలో ఇంటర్వెల్‌ ఉండదు. దీనివల్ల దర్శకుడి మీద ఒత్తిడి ఉండదు. కథను తనకు నచ్చినట్లు చెప్పగలుగుతాడు. సినిమాలో అయితే మొదటి సీన్‌ నుంచి దర్శకుడు ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయటానికి ప్రయత్నించాలి.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

మన వాళ్లు ఓటీటీకి తగినట్లుగా సినిమాలు తీస్తున్నారా?

ఇంకా ఓటీటీ లాంగ్వేజ్‌ పూర్తిగా తెలియలేదు. ‘ఓటీటీలలో బూతులు వాడచ్చు. శృంగారం చూపించవచ్చు’ అనుకొని సినిమాలు తీసేవాళ్లు ఉంటారు. మన దగ్గర హాలీవుడ్‌ డైరక్టర్ల మాదిరిగా నేరుగా ఓటీటీకి సినిమాలు తీసే వారు తక్కువ. పెద్ద డైరక్టర్లు ఓటీటీ కోసం సినిమాలు తీయటం మొదలుపెడితే చాలా మార్పులు వస్తాయి.

ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jul 20 , 2025 | 03:40 AM