Share News

Bitter Gourd: కాకర చేదు తగ్గాలంటే

ABN , Publish Date - May 10 , 2025 | 03:29 AM

కాకరకాయలో ఉన్న పోషక గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చిన్న చిట్కాలు పాటించడం ద్వారా దాని చేదుతనాన్ని తగ్గించి రుచికరంగా తయారుచేయవచ్చు.

 Bitter Gourd: కాకర చేదు తగ్గాలంటే

కాకరకాయలో ఎన్నో పోషకగుణాలు ఉన్నాయి. కానీ చేదుగా ఉంటుందని చాలామంది దానితో చేసే వంటలను ఇష్టపడరు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటించి కాకరకాయ చేదును తగ్గించవచ్చు. అవేంటో తెలుసుకుందాం!

కాకరకాయపైన ఉండే గరుకు భాగాన్ని తొలగించేయాలి. దీని వల్ల సగం చేదు తగ్గుతుంది.

కాకరకాయ ముక్కలకు ఉప్పు రాసి 20-30 నిమిషాల ఉంచి తరువాత ఆ ముక్కలను నీళ్లతో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. దీని వల్ల చేదు కూడా తగ్గుతుంది.

వేడి నీటిలో ఉప్పు వేసి అందులో కాకరముక్కలను నానబెట్టినా చేదును తగ్గించవచ్చు.

కాకరకాయలో విత్తనాలు తీసివేయడం వల్ల కూడా చేదు తగ్గుతుంది.

కాకర ముక్కలకు పెరుగు రాసి గంటసేపు పక్కన పెడితే చేదు చాలావరకూ తగ్గిపోతుంది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 03:29 AM