Moringa benefits for Hair: మునగాకుతో జుట్టుకు పోషణ
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:59 AM
జుట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల హెయిర్‌ప్యాక్‌లు వాడుతుంటారు. అయితే మునగాకు పొడితో తయారు చేసిన ప్యాక్ వలన జుట్టుకు పోషణ అంది ఆరోగ్యంగా...
జుట్టు ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల హెయిర్‌ప్యాక్‌లు వాడుతుంటారు. అయితే మునగాకు పొడితో తయారు చేసిన ప్యాక్ వలన జుట్టుకు పోషణ అంది ఆరోగ్యంగా మారుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
మునగాకులో విటమిన్ బి, సి, జింక్, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి కుదుళ్ల సమస్యలను దూరం చేసి జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
మునగాకు పొడి చుండ్రు, దురద వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది.
మునగాకులోని జింక్ కుదుళ్లలో సీబమ్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కుదుళ్ల సమస్యలను దూరం చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి... ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి తెల్లజుట్టు రాకుండా సహాయపడతాయి.
మునగాకు పొడిలో ఉండే బెహెలిక్, ఓలియిక్ ఆమ్లాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి కురులు పెరిగేలా సహాయపడతాయి.
ఇలా తయారు చేయాలి : ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ మునగాకు పొడి, మరో టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు వేసి మెత్తని పేస్టులా కలపాలి. దీనిని కుదుళ్లకు బాగా పట్టేలా ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..