Monsoon Makeup Tips: వానల్లో చెదరకుండా
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:12 AM
వానలో తడిసినప్పుడు మేకప్ చెదిరిపోతుందనే భయం మహిళలందరికీ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... అడపాదడపా వానల్లో తడుస్తూనే ఉంటాం. అయినా మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...
మేకప్
వానలో తడిసినప్పుడు మేకప్ చెదిరిపోతుందనే భయం మహిళలందరికీ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... అడపాదడపా వానల్లో తడుస్తూనే ఉంటాం. అయినా మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే...
చర్మం శుభ్రంగా: ముఖాన్ని సబ్బుతో శుభ్రపరుచుకున్న తర్వాత తేలికపాటి మాయిశ్చరైజింగ్ జెల్ లేదా లోషన్‌ను పూసుకోవాలి. ఆ తర్వాత బ్లాటింగ్ పేపర్‌తో అదనపు చర్మ నూనెలు, మాయిశ్చరైజర్‌లను తొలగించుకోవాలి.
ప్రైమర్‌తో: మేక్‌పకు ముఖాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు మొదట ప్రైమర్ అప్లై చేయాలి. ఫేస్, ఐ ప్రైమర్‌లను వాడుకోవడం వల్ల చర్మం నునుపుగా మారి, ఫౌండేషన్ పూతకు తగ్గట్టు తయారవుతుంది.
ఫౌండేషన్ పలుచగా: తేమతో కూడిన వాతావరణంలో ఫౌండేషన్ భారీగా వేసుకుంటే అది ముద్దలుగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్, ప్రైమర్ పలుచగా పూసుకున్న తర్వాత ఫౌండేషన్ కూడా వీలైనంత పలుచగా అప్లై చేసుకోవాలి.
సెట్టింగ్ స్ర్పే: సెట్టింగ్ స్ర్పేతో, మేకప్ ముఖం మీద నిలిచి ఉంటుంది. మేకప్ పూర్తయిన తర్వాత సెట్టింగ్ స్ర్పే వాడుకుని, అది ముఖం మీదే ఆరిపోయేలా చూసుకోవాలి.
ఫిక్సింగ్ పౌడర్: ఈ కాలంలో కాంపాక్ట్ పౌడర్‌కు బదులుగా ట్రాన్స్‌క్యులెంట్ పౌడర్‌కు మారాలి. ముఖం తడిసినప్పుడు కాంపాక్ట్ పౌడర్ చెక్కిళ్ల పైనుంచి కారిపోయి చారికలు ఏర్పడతాయి కాబట్టి వానాకాలంలో ఈ పౌడర్ వాడకం మానేయాలి.
వాటర్‌ప్రూఫ్: వాటర్‌ప్రూఫ్ మస్కారా, కాజల్, ఐలైనర్‌లను ఎంచుకోవాలి. సాధారణ ఉత్పత్తులతో పోల్చుకున్నప్పుడు వీటిని తొలగించడం కాస్త ఇబ్బందికరమే అయినప్పటికీ మేకప్ అందవిహీనంగా మారిపోకుండా ఉండడం కోసం ఈ కాలంలో వాటర్‌ప్రూఫ్ సౌందర్య సాధనాలనే వాడుకోవాలి.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి