Share News

Ankol tree: వెండి మొక్క

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:55 AM

ప్రకృతిలో మనకు అవసరమైనవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనమే గుర్తించలేకపోతాం. అలాంటిదే అలాంగియం సాల్విఫోలియం మొక్క. అనారోగ్యానికి ఔషధంగానే కాక వెండి నానో కణాల తయారీకి...

Ankol tree: వెండి మొక్క

ప్రకృతిలో మనకు అవసరమైనవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనమే గుర్తించలేకపోతాం. అలాంటిదే అలాంగియం సాల్విఫోలియం మొక్క. అనారోగ్యానికి ఔషధంగానే కాక వెండి నానో కణాల తయారీకి ఉపయోగపడుతుంది ఇది. ఈ మొక్క గురించి వివరాలు తెలుసుందాం..

దీనిని అంకోల్‌ చెట్టు, ఊడుగ చెట్టు అని కూడా అంటారు. ఇది భారత్‌, శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది. తూర్పు కనుమలలోని అడవుల వద్ద ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 10 నుంచి 12 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్కకు లేత పసుపు రంగు ఆకర్షణీయమైన పువ్వులు పుస్తాయి. సువాసన వెదజల్లే ఈ పూలు వేసవిలో వికసిస్తాయి. ఈ మొక్కకు బెర్రీ రంగు పండ్లు కాస్తాయి. ఈ పండ్లలో ఒకేఒక్క విత్తనం ఉంటుంది. ఈ పండును సంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేదంలో వినియోగిస్తారు. జ్వరం, వాపులు, జీర్ణ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు. ఈ పండ్ల జీవసంబంధ సమ్మేళనాలలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబయల్‌ లక్షణాలు ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మొక్క దాహాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. ఈ చెట్టు పండు ఒక్కదానిని తింటే మండే ఎండాకాలంలోనైనా సరే 3-4 గంటలపాటు దాహం వేయదు. ఈ మొక్క ఆకులను వెండి నానో కణాల తయారీ ప్రక్రియలో వాడతారు.

డాక్టర్‌ శ్రీనాథ్‌,

వృక్ష శాస్త్రవేత్త, కన్హా శాంతివనం, హైదరాబాద్‌

drananthanenisreenath@gmail.com

ఇవీ చదవండి:

జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్‌పై ఎన్నారై పోస్టు వైరల్

22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jul 21 , 2025 | 01:55 AM