IIT Madras AI Courses: స్కూలు టీచర్ల కోసం మద్రాసు ఐఐటీ ఫ్రీ ఏఐ కోర్సులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:38 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రతీ రంగాన్ని రీ షేపింగ్ చేసింది. దీనికి అతీతమైన రంగం అంటూ ఇప్పుడు లేదు. దీనికి ఎడ్యుకేషన్ మినహాయింపు ఏమీ కాదు. లెర్నింగ్ ప్రక్రియను ఏఐ పూర్తిగా మార్చేసింది. ఈ ప్రక్రియను...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రతీ రంగాన్ని రీ షేపింగ్ చేసింది. దీనికి అతీతమైన రంగం అంటూ ఇప్పుడు లేదు. దీనికి ఎడ్యుకేషన్ మినహాయింపు ఏమీ కాదు. లెర్నింగ్ ప్రక్రియను ఏఐ పూర్తిగా మార్చేసింది. ఈ ప్రక్రియను ఎవరైతే తరగతి గది వరకు తీసుకెళ్లగలరో వారే భవిష్యత్తులో విజయవంతమైన ఉపాధ్యాయులుగా నిలబడగలుగుతారు. దేశానికి అలాంటి టీచర్లను తయారు చేయడం కోసం మద్రాస్ ఐఐటీ ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించింది. కిండర్ గార్టెన్ మొదలుకుని ఇంటర్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న స్కూలు టీచర్ల కోసం ‘ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్’ పేరుతో ఉచిత ఆన్‌లైన్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ స్వయం పోర్టల్ ద్వారా ఈ కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. గతంలో ‘ఏఐ ఇన్ ఫిజిక్స్’, ‘ఏఐ ఇన్ కెమిస్ట్రీ’, ‘ఏఐ ఇన్ అకౌంటింగ్’, ‘క్రికెట్ అనాల్సిస్ విత్ ఏఐ’, ‘పైథాన్ ద్వారా ఏఐ/ఎంఎల్’ కోర్సులను తెచ్చింది.
‘ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్’ కోర్సు కాలవ్యవధి 25 నుంచి 45 గంటలు. ఇది పూర్తిగా ఉచితం. దీనిలో సర్టిఫికెట్ కావాలనుకునే వ్యక్తులు నామ మాత్రపు ఫీజు చెల్లించి, ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష రాయాలి. సర్టిఫికెట్ వద్దు అనుకునేవారు ఆన్‌లైన్ కోచింగ్‌తోనే ఆపేయవచ్చు.
ఏఐ అవగాహన పెంచుకోవాలనుకునేవారు, ఏఐతో తమ బోధన ప్రమాణాలు పెంచుకోవాలనుకునేవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఏఐ, కోడింగ్ అనుభవం అవసరం లేదు. డిజిటల్ లిటరసీ ఉంటే చాలు అని చెబుతున్నారు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వి.కామకోటి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఇలా అన్ని రంగాల వారికీ ఉపయోగ పడేలా ఈ కోర్సును డిజైన్ చేశారు. 2025 అక్టోబర్ 10లోపు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: swayamplus. swayam2.ac.in/aiforallcourses
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి