IGNOU free courses 2025: మేనేజ్‌మెంట్ విద్యార్థుల కోసం ఇగ్నో ఉచిత కోర్సులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:42 AM
ఫైనాన్షియల్ అకౌంటింగ్: అకౌంటింగ్, అకౌంటింగ్ ప్రాసెస్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ప్రిపరేషన్, అండర్ స్టాండింగ్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ తదితరాలను ప్రొఫెసర్ సునీల్ కుమార్ బోధిస్తారు....
ఫైనాన్షియల్ అకౌంటింగ్: అకౌంటింగ్, అకౌంటింగ్ ప్రాసెస్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ప్రిపరేషన్, అండర్ స్టాండింగ్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ తదితరాలను ప్రొఫెసర్ సునీల్ కుమార్ బోధిస్తారు. మొత్తం 16 వారాల కోర్సు. 2025 డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్‌మెంట్: బిజినెస్ అండ్ బిజినెస్ ఎంట్రప్రైజె్‌సపై ఉంటుంది. ప్రొఫెసర్ నావెల్ కిశోర్, అతని టీమ్ దీనిని బోధిస్తారు. 16 వారాల కోర్సు. పరీక్షలు 2025 డిసెంబర్‌లో నిర్వహిస్తారు.
బిజినెస్ లా: సోషల్, డొమెస్టిక్, మోరల్, రిలీజియస్, కమర్షియల్‌కి సంబంధించిన అగ్రిమెంట్స్ మొదలైన వాటిపై కోర్సు ఉంటుంది. 16 వారాల కోర్సు. పరీక్షలు డిసెంబర్ రెండో వారంలో ఉంటాయి. ప్రొఫెసర్ డా.మధులిక సారికర్ బోధిస్తారు.
ఇన్‌కంటాక్స్ లా అండ్ ప్రాక్టీస్: ఇన్‌కంటాక్స్ చట్టాలు, ప్రాక్టీస్ పట్ల విద్యార్థులకు అవగాహన పెంచడం కోసం ఉద్దేశించిన 15 వారాల కోర్సు ఇది. డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రిన్స్‌పల్స్ ఆఫ్ మార్కెటింగ్: ఏ వ్యాపారంలోనైనా మార్కెటింగ్ రోల్‌ను అర్థం చేసుకోవడం, తదితరాలపై ఏర్పాటు చేసిన కోర్సు ఇది. ప్రొఫెసర్ డాక్టర్ అనుప్రియా పాండే దీనిని బోధిస్తారు. 16 వారాలో కోర్సు. డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తారు.
బిజినెస్ కమ్యూనికేషన్: బిజినెస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, మీటింగ్స్, బిజినెస్ డీలింగ్స్, క్లయింట్ ప్రజంటేషన్ తదితరాలన్నీ ఇందులో బోధిస్తారు. ప్రొఫెసర్ డాక్టర్ రశ్మీ బన్సాల్ దీనిని బోధిస్తారు. మొత్తం 12 వారాల కోర్సు. పరీక్షలు 2025 డిసెంబర్‌లో ఉంటాయి.
ఫైనాన్షియల్ లిటరసీ: ఫైనాన్స్‌లో కెరీర్ ఎంచుకోవాలనుకునే వారికి ఉద్దేశించిన కోర్సు ఇది. భారతదేశంలో ఫైనాన్షియల్ సెక్టార్‌లో పేరొందిన వారు బోధిస్తారు.
ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్: కోర్సు వ్యవధి 12 వారాలు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫండమెంటల్స్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తదితరాలపై కోర్సు ఉంటుంది. ఎంట్రప్రెన్యూర్స్ కావాలనుకునే వారిని, కాలేజ్ లెర్నర్స్, చిన్న బిజినెస్ వారిని ఉద్దేశించి తయారు చేశారు. వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కల్పిస్తారు.
మేనేజ్‌మెంట్, కామర్స్ విద్యార్థుల కోసం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) కొన్ని ఉచిత కోర్సులను అందిస్తోంది. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘స్వయం’ (https://swayam.gov.in) పోర్టల్‌లో ఈ కోర్సుల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, అలాగే ఎన్‌రోల్ కావచ్చు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి